బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తులసివనం లాంటి వనపర్తి నియోజకవర్గంలో గంజాయి మొక్క లాంటి వాళ్లను గెలిపించి చాలా తప్పు చేశారని తెలిపారు. గుడి మాన్యాలను, వనపర్తి నడిబొడ్డున వున్న 300 కోట్ల భూములను కొల్లగొడుతున్న మంత్రి… ఎలాంటి వాడో గ్రహించి అతడికి బుద్ది చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ MlC అభ్యర్థి చిన్నారెడ్డి నికార్సయిన వ్యక్తి అని… ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక కావాలి అందుకే చిన్నారెడ్డి కి అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణా ప్రజలంతా కేసీఆర్ చేతిలో మోసపోయినవారేనని… అందుకే ఓటుతో గుణపాఠం చెప్పాలని తెలిపారు. BJP నాయకులు సిగ్గు మాలిన దద్దమ్మలని, రైతులను, నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు ఎలా ఓటు అడుగుతారని నిలదీశారు. ఢిల్లీలో చాయివాలా, గల్లీలో మందువాలా ఇలా ఇద్దరు సన్యాసులు తయారయ్యారని పేర్కొన్నారు. ఇవి నీతికి, అవినీతికి జరుగుతున్న ఎన్నికలు ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు ఎంపీ రేవంత్ రెడ్డి.
previous post
next post