telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రైవేట్ జెట్ లో ప్రభాస్ బృందం…!!

prabhas

`జిల్` ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జార్జియా షూటింగ్ షెడ్యూల్‌ మంగళవారంతో పూర్తయింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జార్జియాలో ఉన్న ప్రభాస్‌, చిత్రబృందం ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే  ఎటువంటి అసౌకర్యమూ లేకుండా చిత్రీకరణ పూర్తి చేసినట్టు దర్శకుడు తెలిపారు. జార్జియాలో షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమైంది. ఈ సందర్భంగా ప్రైవేట్ జెట్‌లో తీసుకున్న ఫోటోను దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రభాస్‌తో పాటు దర్శకుడు రాధాకృష్ణ, చిత్ర నిర్మాత ప్రమోద్, నటుడు ప్రభాస్ శ్రీను తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు.

Related posts