యంగ్ హీరో నాగశౌర్య, మెగా హీరోయిన్ నిహారిక గతంలో “ఒక మనసు” సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి వీరి పెళ్ళి గురించిన వార్తలు మీడియాలో మొదలయ్యాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అప్పట్లోనే వీరిద్దరూ ఖండించారు. అయినా ఇప్పటికీ ఆ వార్తలు ఆగడం లేదు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగశౌర్య నిహారికతో ప్రేమ వార్తల గురించి స్పందించాడు. “నేను, నీహారిక పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు తెగ రాస్తున్నారు. ఈ ప్రచారం ఎక్‌రడి వరకు వెళుతుందో, ఎక్కడ ఆగుతుందో అర్థం కావడం లేదు. రెండ్రోజుల క్రితం నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి “మీ ఇద్దరి స్టోరీ ఏంటి?” అని అడిగారు. నేను షాకయ్యా. నేను, నిహారిక ప్రేమలో లేము. నేను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్‌లో లేనలేను” అని నాగశౌర్య స్పష్టం చేశాడు.
previous post