నటుడు మురళీమోహన్ వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాదులోని తన నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. తాజాగా ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయ కుమారుడు నారా లోకేష్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ కుటుంబసభ్యులతో వారు ముచ్చటించారు. మరోవైపు… తాను కోలుకుంటున్నానని, త్వరలోనే ఆపరేషన్ కుట్లు తీస్తారని ఓ వీడియో ద్వారా మురళీమోహన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ తీరుతో రాష్ట్రం అభాసుపాలు: ఉత్తమ్