telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పహిల్వాన్‌ లతో పవన్ కళ్యాణ్…

రాజకీయంగా కారణంగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. పవన్ ఇటీవల వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణను ముగించుకున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ లోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఫైటర్లు ఉన్నారు. చూస్తుంటే… ఈ షూటింగ్ లో ప్రస్తుతం ఫైట్స్ తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కొత్తగా ఈ సినిమాకు కేవలం వీరమల్లు అనే టైటిల్‌ను పరివీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా నుంచి స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనున్నారంట. అందులో సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్త లుక్స్‌లో కనిపించనున్నారంట. ఈ సినిమా కోసం పవన్ తన పిట్‌నెస్‌లో మార్పులు చేయాలని అనుకుంటున్నారంట. అందుకోసం పవన్ తన కెరీర్‌లో చాలా గ్యాప్ తరువాత మళ్లీ జిమ్‌లో కసరత్తులు చేసేందుకు సిద్దమయ్యారు. అందుకుగాను స్పెషల్ ట్రైనర్‌ను సిద్దం చేసుకున్నారంట.

Related posts