telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

క‌రోనా వ్యాక్సిన్ కోసం వేగంగా చ‌ర్య‌లు: డొనాల్డ్ ట్రంప్

trump usa

ప్ర‌పంచాన్ని అతలాకుతలం చేస్తున్న క‌రోనా వైర‌స్ కు వ్యాక్సిన్ కనుగునేందుకు ప్ర‌పంచ దేశాలు కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన నేపథ్యంలో అంతత్వ‌ర‌గా వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ప‌లువురు చెప్పారు. వ్యాక్సిన్ అంశంపై మ‌రోసారి ట్రంప్ స్పందించారు.

కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు సాధారణంగా సంవత్సరాల తరబడి ప్రక్రియ కొన‌సాగుతుంద‌ని అన్నారు. తమ ప్రభుత్వం వందల బిలియన్ డాలర్లు ఖ‌ర్చుచేసి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే య‌త్నాల‌ను వేగవంతం చేసిందని చెప్పారు.వ‌చ్చే ఏడాది జనవరి నాటికి అమెరికాలో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు 300 మిలియన్ల డోసులను సిద్ధం చేసేందుకు ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్” పేరుతో అమెరికా ఓ కార్యక్రమం ప్రారంభించింద‌ని వివ‌రించారు.

Related posts