telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ : వికసిస్తున్న కమలం పార్టీ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. 150 డివిజన్ల ను 30 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ ఫోన్లను నిషేధించారు. అయితే… కౌంటింగ్‌ మొదలు కావడంతోనే… కమలం వికసిస్తోంది. కారు జోరుకు బ్రేకులు వేస్తు… బీజేపీ దూసుకుపోతోంది. అటు పోస్టల్‌ బ్యాలెట్‌ లోనూ బీజేపీ మంచి ఫలితాలను రాబట్టింది. ఇప్పటి వరకు బీజేపీ 35 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ మొదట్లోనే డీలా పడిపోయి… 17 సీట్లల్లో లీడింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండగా… మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితాలు రానున్నాయి. ఇక ఎవరు గెలుస్తురో చూడాలి. 

Related posts