telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త లుక్ కోసం కష్టపడుతున్న పవర్‌ స్టార్‌…!

Pspk

సాధారణంగా సినీ హీరోలంటేనే రోజు జిమ్ చేస్తూ, డైట్ పాటిస్తూ వారి బాడీని ఒక పర్ఫెక్ట్ పొజిషన్‌లో ఉంచుకుంటారు. దాని కోసం వారు నానా తంటాలు పడుతుంటారు. అయితే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కూడా ఈ కోవకే చెందుతాడు. రోజు జిమ్ చేసే పవన్ రాజకీయ అరంగేట్రం తరువాత తన శరీర దారుడ్యానికి ఇసుమంత కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. కేవలం ప్రజలు, ప్రజా సమస్యలంటూ ఉన్నాడు. రాజకీయాల కోసం తన సినీ జీవితాన్ని పక్కన పెట్టిన పవన్ మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ రీఎంట్రీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’తో ప్లాన్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలుసిందే. అయితే ఈ సినిమాలో తన లుక్స్‌లో కాస్త మార్పులు రావాలని. పవన్ కొత్త డైట్‌ను అనుసరిస్తున్నాడట. అయితే పవన్ ప్రస్తుతం కాన్నా కాస్త సన్నగా ఉండాలని లిక్విడ్ డైట్‌ను పాటిస్తున్నాడు. మెగా డాటర్ నిమారిక వివాహం కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన పవన్ నిహారికా పెళ్లి తరువాత సినిమా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నాడు.

Related posts