కరోనా కారణంగా పాఠశాలలు మూసి ఉంచడం, తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోవటంతో తమ కుటుంబ సభ్యులైన విద్యాసంస్థల సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేకపోవడం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కరస్పాండెంట్ మానసికంగా ఎంతో కలచివేసిందని, తీవ్రమైన ఆవేదనతో ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయ లోకాన్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రస్మా రాష్ట్ర శాఖ తరపున అభ్యర్థించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు తెలియజేశారు. ఇదే విషయమై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో పాటు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మంత్రులు కమలాకర్ గారు మరియు ఇతర మంత్రులకు, ఎమ్మెల్సీలకు , ఎమ్మెల్యేలకు ట్రస్మా సమర్పించిన వినతి పత్రాలకు స్పందించి ప్రతి ఒక్క ప్రైవేట్ ఉపాధ్యాయునికి,రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కిలోల బియ్యాన్ని ప్రతినెల ఇవ్వటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయటం పట్ల ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మ సంతృప్తిని కలిగించిందని శేఖర్ రావు తెలియజేశారు.
మొదటి విడతలో దాదాపు లక్షా ఇరవై వేల మందికి ఈ నెలకు ₹2000 మరియు 25 కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని రెండో విడతలో మరో 80 వేల మంది ప్రైవేటు టీచర్లకు సహాయం అందించుటకు ముఖ్యమంత్రి గారు నిర్ణయించటం ఎంతో ఊరట కలిగించిందని ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ తెలియజేశారు.
ఈ ప్రక్రియ సజావుగా సాగటానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం సకాలములో అనుటకు జిల్లాస్థాయిలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యేలకు, రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గారికి, కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్లకు , ఆర్ జె డి లు , జిల్లా విద్యాశాఖ అధికారులకు, మండల స్థాయిలోని ఎంఈవోలు వారి సిబ్బందికి తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ కుటుంబం ట్రస్మా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర కోశాధికారి ఐ వి రమణ రావు తెలియజేశారు. ముఖ్యంగా సమస్యలకు అక్షర రూపందాల్చి మండల స్థాయి మొదలు ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు సమస్యలను స్పష్టంగా తెలియజేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ కుటుంబం తరఫున ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో యాదగిరి శేఖర్ రావు ఎస్ మధుసూదన్ మరియు రమణరావు తెలియజేశారు.
రేయ్ రామ్ గోపాల్ వర్మ… సిగ్గులేనోడా… వర్మపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు