సోనియా గాంధీ నివాసంలో “కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ” (సి.డబ్ల్యు.సి) సమావేశం జరిగింది. అయితే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ సీరియస్ అయ్యారు. పార్టీనేతల నుంచి నివేదిక కోరారు సోనియా గాంధీ. అలాగే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి ఎంపికపై చర్చ నిర్వహించారు సోనియా గాంధీ. జనవరి 22న జరిగిన సి.డబ్ల్యు.సి సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ జూన్ చివరి నాటికి పూర్తి చేద్దామని తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలకు గుర్తు చేసింది సోనియా గాంధీ. “పార్టీ ఎన్నికల అథారిటీ” చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నికల షెడ్యూల్ ను సిద్ధం చేశారని సోనియా గాంధీ ప్రకటించారు.