telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమస్యల్లో చిక్కుకున్న శ్రియ… లండన్ పోలిసుల హై సెక్యూరిటీ జోన్‌లో…!

Shriya

2001లో ‘”ఇష్టం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. 18 ఏళ్లుగా స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ 2018లో ఆండ్రీ కొశ్చెవ్‌ని రాజ‌స్థాన్‌లో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌ని పూర్తిగా త‌గ్గించేసింది. చివ‌రిగా “గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి” చిత్రంతో ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ఇప్పుడు ప‌లు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం హిందీలో “తడ్కా” , తమిళంలో “నరగాసురన్”, “సండకారి” సినిమాలలో నటిస్తోంది. అయితే శ్రియ సోష‌ల్ మీడియాను శ్రియా బాగానే ఉప‌యోగించుకుంటుంది. గ్లామ‌ర్ ఫొటోల‌ను, వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్ర‌కారును, అభిమానులను ఆక‌ట్టుకుంటోంది. 36 ఏళ్ళ వ‌య‌స్సులోను శ్రియ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. కాగా “సండ‌కారి” అనే త‌మిళ చిత్రంలో శ్రియ న‌టిస్తుండ‌గా, ఈ మూవీ ప్ర‌స్తుతం లండ‌న్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. లండ‌న్ ఎయిర్ పోర్ట్ ప‌రిస‌రాల‌లో శ్రియ‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తుండ‌గా, అనుకోకుండా ఈమె హై సెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన లండ‌న్ పోలీసులు శ్రియ‌పై తుపాకీ ఎక్కుపెట్టి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. షాక్‌లో ఉన్న శ్రియ‌కి ఏం చేయాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డింది. దీంతో చిత్ర యూనిట్ స‌భ్యులు త‌గిన అనుమ‌తి ప‌త్రాలు చూపించాక లండ‌న్ పోలీసులు ఆమెని వ‌దిలేశారు.

Related posts