telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ నుంచి కార్పొరేటర్‌ దాకా దోచుకున్నారు…

సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అర్వింద్‌. బీజేపీ వస్తే మత కలహాలు వస్తాయని కేటీఆర్‌ అంటున్నారని.. మరి భైంసా బాధితులను ఆయన పలకరించారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నగరంలో పర్యటించారని.. ఆయన సూచనల మేరకే కేంద్రం రూ. 440 కోట్లను హైదరాబాద్‌కు పంపిందని తెలిపారు. అదే వరదల సమయంలో సమయంలో కేసీఆర్‌ హైదరాబాద్‌కు రాలేదన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బుల్లో రూ. 250 కోట్లను కల్వకుంట్ల కుటుంబం కొట్టేసి.. మిగిలిన డబ్బులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పంచిందన్నారు. టీఆర్‌ఎస్‌ అవినీతి సొమ్మును జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పంచుతోందని.. కేసీఆర్‌ నుంచి కార్పొరేటర్‌ దాకా ప్రజల డబ్బులను దోచుకున్నారని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ అవినీతిలో ఓవైసీకి కమీషన్‌ ఉందని అర్వింద్‌ ఆరోపించారు. అదే బీజేపీలో అవినీతికి ఆస్కారం లేదని.. మోడీ ఏడేళ్ల పాలనలో దేశంలో ఒక్క స్కామ్‌ కూడా జరగలేదని పేర్కొన్నారు. బీజేపీని గెలిపిస్తే.. వరద సాయం కింద రూ. 25 వేలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

Related posts