telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ ప్రదీప్ కు ఆ హీరోయిన్ తో ఎఫైర్… దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

Pradeep

యాంకర్ ప్రదీప్‌కు హీరోయిన్‌తో ఎఫైర్ ఉందట. ఇలా ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ అందరూ షాకయ్యే విషయాలను బయటపెట్టారు దర్శకుడు శ్రీరామోజు. మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో పాటు రవితేజపై పోలీస్ కేసు కూడా పెట్టాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘బలుపు’ సినిమాలో రవితేజ, శ్రుతి హాసన్, అంజలి ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో ముందు సునిశిత్‌నే హీరోగా తీసుకున్నారట. ఆ తర్వాత ఓరోజు రవితేజ ఫోన్ చేసి నేను సీనియర్‌ని నేను సినిమా చేస్తాను అని బెదిరించారట. ఈయన ఒప్పుకోలేదంట. దాంతో రూ.45 లక్షలు ఇచ్చి సినిమాను వదులుకోవాలని చెప్పారట. దాంతో సునిశిత్ సినిమాను వదులుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇచ్చిన 45 లక్షల నుంచి 35 లక్షలు తీసేసుకున్నారట. దాంతో రవితేజపై పోలీసులకు ఫిర్యాదు చేసానని సునిశిత్ తెలిపారు. కావాలంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు గురించి ఆరా తీసుకోండి అంటూ బహిరంగంగా తన ఫోన్ నెంబర్‌ను చెప్పారు.సునిశిత్ వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు, హీరోయిన్ లావణ్య త్రిపాఠికి అఫైర్ ఉందట. కావాలంటే లావణ్యకు ప్రదీప్ చేసిన మెసేజ్‌లు కూడా చూసుకోండి అంటున్నారు. ఆ మెసేజ్‌లన్నీ తాను చదివానని తెలిపాడు. ఇవన్నీ తాను పాపులారిటీ కోసం చేయడంలేదని, కావాలంటే చెక్ చేసుకున్నాక అబద్ధం అని తేలితే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పడుకోబెట్టి మరీ చితక్కొట్టండి అని సవాలు విసిరారు.

Related posts