telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అగ్రి గోల్డ్ వ్యవహారం పై దూకుడు పెంచిన ఈడీ…

Money

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అగ్రిగోల్డ్ కేసులో‌ దూకుడు పెంచింది. ఆ సంస్థ ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది ఈడీ. మొత్తం 4వేల 109 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలోని అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్ చేసినట్లు ప్రకటించింది. ఏపీలోని 56 ఎకరాల హాయ్‌లాండ్ ఆస్తులతో పాటు పలు కంపెనీల్లోని వాటాలను అటాచ్ చేసింది ఈడీ.  ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల మంది డిపాజిట్ దారుల నుంచి సుమారు 6వేల 380 కోట్ల రూపాయలను వసూలు చేసింది అగ్రిగోల్డ్. 942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించింది. దీంతో చైర్మన్ తో పాటు పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసింది ఈడీ. సీఐడీ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నిన్న అగ్రిగోల్డ్ ప్రమోటర్లను కోర్టులో హాజరుపరిచింది ఈడీ. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్ రావును ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts