కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా..కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా కరోనా బారినపడ్డారు.. గత రెండు రోజులుగా ఆయన స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా… పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి ఇరానీ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాల్సింది అని కోరారు. కాగా..ఇటీవలే కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
previous post
next post
పీపీఏలపై హైకోర్టు తీర్పు జగన్ సర్కారు కు చెంప పెట్టు: కళా వెంకట్రావ్