telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లపెంపుపై .. కేంద్రం చర్చలు…

central govt on increasing assembly seats

ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్ పునర్విభజన పూర్తికావడంతో, ఎన్నికలకు సమాయత్తం అవుతుంది కేంద్రం. తాజా నిర్ణయంతో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా, జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సీఈసీ సునీల్ అరోడా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.

జమ్ముకశ్మీర్ పునర్విభజన, సీట్ల పెంపు అవకాశంపై చర్చించింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై కమిషన్ ఏర్పాటు చేసే యోచనలో ఈసీ ఉన్నట్టు సమాచారం. కేంద్రం నుంచి నోటిఫికేషన్ రాగానే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఏపీ, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల పెంపు విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం.

Related posts