telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తేజ సజ్జా మరో సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల….

తెలుగు సినిమాల్లో బాలనటుడిగా మొదలయ్యి హీరోగా మారాడు తేజ సజ్జా. తేజ హీరోగా చేసిన మొదటి సినిమా జాంబిరెడ్డి మంచి ప్రజాదరణ అందుకుంది. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కానీ మూవీ మేకర్స్ ఫస్ట్‌లుక్ అని కాకుండా ఫస్ట్‌జోల్ట్ అంటున్నారు. పోస్టర్ కూడా అదేస్తాయిలో ఉంది. ఈ పోస్టర్‌లో హీరో తేజ కాస్త సీరియస్‌ లుక్‌తో ఉన్నారు. అతడి ముందు హీరోయిన్ ప్రియా ప్రకాష్ నవ్వుతూ కనిపిస్తున్నారు. అయితే లవ్ స్టోరీస్ సినిమాలు చూసి బోర్ అయ్యారా అంటూ తేజ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అనేది కాప్షన్. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎస్ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ఆర్‌బీ చౌదరి సమర్పిస్తుండగా మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మెహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి సినిమాతో థియేటర్లలో తేజా చేసిన సందడితో అతడి రెండో సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కూడా కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి తేజ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారేమో వేచి చూడాలి.

Related posts