telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

కొత్త కరోనా పై మంత్రి ఆళ్ల నాని కీలక ప్రకటన…

యూకే లోని కొత్త కరోనా ఇప్పుడు భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఏపీలో కొత్త కోరోనకు సంబంధించి వైద్యశాఖా మంత్రి ఆళ్ల నాని కీలక ప్రకటన చేశారు. కరోనా ఏపీలో కంట్రోల్లో ఉందన్న ఆయన కరోనా సెకండ్ వేవ్ ఏపీకి తాకకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. కరోనా కొత్త స్ట్రెయినుతో ప్రజల్లో ఆందోళన ఉంది కానీ ఏపీలో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవు అని అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన టెస్టుల్లో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని అన్నారు. రాజమండ్రిలో కరోనా సోకిన మహిళ కుమారునికి నెగెటీవ్ అని తేలిందని  రాజమండ్రి మహిళకు కరోనా పాజిటీవ్ వచ్చినా నార్మలుగానే ఉన్నారని అన్నారు. రాజమండ్రిలో కరోనా సోకిన మహిళ నమూనాలను పుణేకు పంపామన్న ఆయన పుణే ల్యాబ్ నుంచి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నామని అన్నారు. రాజమండ్రి మహిళ యూకే నుంచి వచ్చారు కాబట్టే అననమానాలు ఉన్నాయని అందుకే ప్రజలెవరూ భయాందోళనలు చెందొద్దని అన్నారు. విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా బృందాలు నియమించామని అలాగే ఇతర రాష్ట్రాల్లోని ఎయిర్ పోర్టుల్లో కూడా బృందాలు పెట్టామని అన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని ఆయన అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts