తెలంగాణలో ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్ల వేల మంది విద్యార్థుల భవిష్యత్ ఆందోళనలో పడిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. 12 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు సీఎంకేసీఆరే కారణమని రేవంత్ ఆరోపించారు. విద్యారుతులు ఆత్మహత్య లకు పాల్పడుతుంటే కేసీఆర్ ఏంచేస్తున్నారని రేవంత్ నిలదీశారు. బాగా చదివే విద్యార్థులకు సున్నా మార్కులు వేసి వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
వేలమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్ష జరపడంలేదని ప్రశ్నించారు.ఈ మొత్తం ప్రహసనానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. ఇవి ఆత్మహత్యలు కావు, ముఖ్యమంత్రి చేసిన హత్యలే అని ఆరోపించారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పారిపోయి, పోలీసులతో అణచివేయాలని చూస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల విషయంలో విద్యాశాఖ మంత్రిగ జగదీశ్ రెడ్డి వైఫల్యం చెందాడని, తక్షణమే ఆయన పదవికీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.