నేడు ఒప్పో మొబైల్ ఉత్పాదక సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్ రెనో ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సైడ్ లిఫ్టింగ్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. రూ.32,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు జూన్ 7వ తేదీ నుంచి లభ్యం కానుంది.
ఒప్పో రెనో ఫీచర్లు :
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్,
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0 పై,
డ్యుయల్ సిమ్,
48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డాల్బీ అట్మోస్,
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 5.0,
ఎన్ఎఫ్‌సీ,
యూఎస్‌బీ టైప్ సి,
3765 ఎంఏహెచ్ బ్యాటరీ-ఫాస్ట్ చార్జింగ్.