telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : .. సాయం చేస్తామని.. మాటమారుస్తారు.. జాగర్త!

today rasi falalu

మేషం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మిథునం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

సింహం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

కన్య : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

తుల : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవడానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

ధనుస్సు : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం కాదు.

మకరం : ఈ రోజు మీ జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి. స్నేహితులతో కలిసి వినోద యాత్ర చేస్తారు. మీ జీవిత భాగస్వామి సహా యం అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార సంబంధ పెట్టుబడులు కానీ, ఒప్పందాలు కానీ చేస్తారు. నివాస స్థలంలో మార్పు ఉంటుంది.

కుంభం : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నీటి కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశముంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ తగినంత డబ్బు సమయానికి అందుతుంది. సహోద్యోగుల సహకారం అందుకుంటారు.

మీనం : ఈ రోజు చేపట్టిన పనులు అధిక శ్రమతో పూర్తి చేయగలుగుతారు. సాయం చేస్తా అని చెప్పిన వారు సమయానికి మాట మార్చే అవకాశముంటుంది. దాని కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

Related posts