telugu navyamedia
Uncategorized క్రీడలు రాజకీయ వార్తలు

ఇండోపాక్ ఫైట్ గురించి కేంద్రం చూసుకొంటుంది: క‌పిల్‌దేవ్

India Pakistan Cricket Kapildev

పాకిస్థాన్ తో ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల వ‌ద్దా అన్న అంశంపై ఇప్పటికే పలువురు సీనియర్ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా మాజీ ఆల్ రౌండర్ క‌పిల్‌దేవ్ కూడా ఈ అంశంపై స్పందించాడు. వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రెండు దేశాలు త‌ల‌ప‌డాలా వ‌ద్దా అన్న అంశాన్ని కేంద్రానికే వ‌దిలేయాల‌న్నారు. పుల్వామా దాడి ఘ‌ట‌న త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌ల‌హీన‌ప‌డ్డాయి. పాక్‌తో ఆడ‌కుంటే మంచిద‌ని కొంద‌రు సీనియ‌ర్లు, ఆడ‌కుంటే పాయింట్లను కోల్పోతామ‌ని మ‌రికొంద‌రు సీనియ‌ర్లు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇండియాకు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన మాజీ కెప్టెన్ క‌పిల్‌ కూడా ఈ అంశంపై మాట్లాడారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాక్‌తో ఇండియా ఆడాలా వ‌ద్దా అన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంద‌ని, ప్రభుత్వమే దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు. ఇండోపాక్ ఫైట్ గురించి మ‌నలాంటి వాళ్లు నిర్ణయించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఈ అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల‌ని పేర్కొన్నారు. మ‌న అభిప్రాయాల‌ను మ‌రొక‌రిపై రుద్దడం స‌రికాదు అని క‌పిల్ అన్నాడు.

Related posts