ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఎన్నికల వైపు ఎలా చూస్తుందో.. అలా ప్రపంచంమొత్తం అమెరికా ఎన్నికలకు వైపు చూస్తుంది. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆ ఎన్నికలపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల వల్ల దేశంలో అశాంతి, అలజడి చెలరేగే ప్రమాదం ఉందన్నారు మార్క్. అయితే ఆ ప్రమాదాలను నివారించేందుకు సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మూడవ క్వార్టర్ లాభాలపై జరిగిన చర్చలో మాట్లాడుతూ జుకర్‌బర్గ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేందుకు వారాల పాటు సమయం పడుతోందని, దీని వల్ల దేశంలో అశాంతి చెలరేగే అవకాశాలు ఉన్నట్లు జుకర్‌బర్గ్ అన్నారు. అదే విధంగా ఎన్నికలకు వారం రోజుల ముందు రాజకీయ ప్రకటనలను బ్యాన్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి జూకర్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణల యుద్ధం తీవ్రత పెరిగింది.
previous post
ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి: విజయసాయిరెడ్డి