telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

11 ఏళ్ళ బాలుడిని తండ్రిని చేసింది… పిల్లాడిని చూసుకుంటుందని ఆయాను తీసుకొస్తే…!?

Women

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ 11ఏళ్ల కుర్రాడు తండ్రయ్యాడు. అసలు విషయం తెలుసుకొని వెంటనే కోర్టుకెక్కారు. ఆ కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఆఫీసుకు వెళ్తున్నారు. దీంతో ఇంట్లో పిల్లలను వదిలేయాల్సి వస్తోంది. పిల్లలను చూసుకోవడానికి ఎవరైనా ఆయా దొరికితే బావుంటుందని వారు ఆలోచించారు. అదే సమయంలో తెలిసిన వాళ్లు మరిస్సా మోరీ అనే యువతిని వారికి పరిచయం చేశారు. వారింట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడానికి మరిస్సా ఒప్పుకొంది. ఇది జరిగింది 2014లో. అదే ఏడాది మరిస్సా తల్లయింది. అయితే పుట్టిన పిల్లాడికి తండ్రి ఎవరని ఆ కుటుంబం అడగలేదు. అది మరిస్సా వ్యక్తిగత విషయమని భావించి వదిలేశారు. ఆ తర్వాత ఆ పసికందు తండ్రి తమ 11ఏళ్ల కొడుకునేనని తెలిసి షాకయ్యారు. మరిస్సాను నిలదీస్తే ఆమె కూడా అది నిజమేనంది. దీంతో వారు కోర్టుకెక్కారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెల్లడించింది. ఆ పిల్లాడే తనను బలవంతం చేశాడన్న మరిస్సా వాదనను కొట్టిపారేసింది. ఆమే కావాలని ఆ పిల్లాడితో లైంగిక చర్యల్లో పాల్గొన్నదని, అది కూడా సుమారు 3ఏళ్లపాటు ఈ తతంగం కొనసాగిందని కోర్టు నిర్ధారించింది. కామపిశాచిలా ప్రవర్తించి, ప్రపంచం గురించి తెలియని ఓ పసివాణ్ణి తండ్రిని చేసినందుకుగాను ఆమెకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెకు పుట్టిన బాబు మంచిచెడులు ప్రస్తుతం 17ఏళ్ల వయసున్న తండ్రే చూస్తున్నాడు.

Related posts