కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్ననేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా తమ ఎమ్మెల్యే ఓటు వేస్తారని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.మాయావతి ట్వీట్‌కు ముుందే బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ మాట్లాడుతూ.. అధినేత్రి మాయావతి సూచన మేరకు నేటి బలపరీక్షకు హాజరుకాబోనని నిన్న స్పష్టం చేశారు.
ఆ ప్రకటన తర్వాత కాసేపటికే మాయావతి ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీకి హాజరై తమ ఎమ్మెల్యే కుమారస్వామికి అనుకూలంగా ఓటు వేస్తారని మాయావతి ప్రకటించారు. గత నెల రోజులుగా జరుగుతున్న కర్ణాటక హై డ్రామాకు నేటితో తెరపడే అవకాశం ఉంది. రెబల్ ఎమ్మెల్యేలు పట్టువీడకపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ కాదు: నితిన్ గడ్కరీ