కరోనా మొత్తం ప్రపంచంతో పాటుగా ఫ్రాన్స్‌ను కూడా అతలాకుతలం చేసింది. అయితే, ఇప్పుడు క్రమంగా అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.. కేసులు తగ్గిపోయాయి.. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా పుంజుకుంది… దీంతో.. కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్.. ఈ నెల 20వ తేదీ నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం కూడా తప్పనిసరి కాదని ప్రకటించారు… కాగా, ఫ్రాన్స్‌లో రాత్రికర్ఫ్యూతోపాటు బయటికొస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన ఉంది.. గత ఏడాది నుంచి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి.. మరోవైపు ఇక నుంచి రాత్రి కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి అమల్లోకి రానుంది. కాగా, భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే చూడాలి మరి మన దేశంలో ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనేది.
previous post
next post
చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్