telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కశ్మీర్‌ సరిహద్దులో వంతెలను ప్రారంభించిన రాజ్‌నాథ్

committee on jamili elections said rajnath singh

జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆరు వంతెనలను ప్రారంభించారు. అఖ్నూర్, జమ్మూ సెక్టార్లలో రూ.45 కోట్ల వ్యయంతో సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) వీటిని నిర్మించింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆరు వంతెనలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. సరిహద్దుల్లో బీఆర్వో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై మంగళవారం ఆయన సమీక్షించిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో కీలకమైన రహదారులు, వంతెనలు, సొరంగాలను సరిహద్దు రహదారుల సంస్థ నిర్మిస్తున్నది. లఢక్ సరిహద్దులో చైనాతో ఘర్షణ నెలకొన్నప్పటికీ కీలక ప్రాజెక్టులను పూర్తి చేసింది. గత ఆర్థిక ఏడాది కంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం అదనపు పనులను బీఆర్వో చేపట్టింది.

Related posts