telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆన్‌లైన్‌ గేమ్‌కు బలైన మరో యువకుడు…

suicide

యువకుల ప్రాణాలను ఆన్లైన్ గేమ్స్ బాలి తీసుకుంటూనే ఉన్నాయి. ఏదో సరదాగా స్టార్ట్‌ చేసి.. ఆ తర్వాత ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసలైపోతున్నారు కొందరు యువకులు.. ఆ తర్వాత అప్పులు చేసి మరీ గేమ్‌లు ఆడుతున్నారు.. అప్పుల్లో కూరుకుపోయి చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా.. ఎల్బీనగర్‌కు చెందిన జగదీష్ అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైపోయాడు.. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన జగదీష్.. గతంలోనే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.16 లక్షల వరకు పోగొట్టుకున్నాడు.. అప్పులు ఎక్కువ కావడంతో.. కొడుకు బాధను చూడలేక.. జగదీష్‌ తండ్రి ఆ రూ.16 లక్షల అప్పులు తీర్చాడు. మరి పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలి అనుకున్నాడో ఏమో మరి.. కానీ, మళ్లీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం ప్రారంభించాడు జగదీష్‌.. అప్పులను అధిగమించేందుకు మళ్ళీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం ప్రారంభించాడు.. కానీ, తిరిగి డబ్బులు రాకపోవడానికి తోడు.. మళ్లీ అదనంగా అప్పులు అవుతుండడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన జగదీష్‌.. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts