telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ బడ్జెట్ పరిస్థితి తెలిసిన వారికి ఓ డౌట్: ఉండవల్లి

Undavalli Arun kumar

ఏపీ బడ్జెట్ పరిస్థితి గురించి తెలిసిన వారికి రేపు రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందన్న ఓ డౌట్ వస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి సీఎం జగన్ ప్రజా సంక్షేమంపైనే ఎక్కువ పెడుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు హామీలిచ్చిన అంశాలతో పాటు హామీలు ఇవ్వని అంశాలను కూడా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

గత సీఎం అమరావతికే ప్రాధాన్యత ఇచ్చి దానికే ఖర్చు చేశారు. ఏడు లక్షల పింఛన్లు రద్దయ్యాయన్న విషయంపై ప్రచారం జరుగుతోంది తప్ప కొత్తగా ఇచ్చిన 14 లక్షల ఫింఛన్లపై ప్రచారం జరగడం లేదని ఆయన చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, జీడీపీ పెరగాలి, ట్యాక్స్ వస్తుంది, అప్పుడు ఏయే కార్యక్రమాలు చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోలవరం ఏటీఎంలా తయారయిందని మోదీ కూడా అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన లెక్కలను మాత్రం చూపలేదని చెప్పారు.

Related posts