ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో ఏకకాలంలో రెండు పతకాలను ఖాయం చేసుకుంది. అమిత్ (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (62 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో సంజీత్ (91 కేజీలు) 1-4తో ఏడో సీడ్ జూలియో టోరెస్ (ఈక్వెడార్) చేతిలో… కవీందర్ సింగ్ బిష్త్ (57 కేజీలు) 0-5తో మెక్‌గ్రెయిల్ (ఇంగ్లండ్) చేతిలో ఓటమి చెందారు.
అమిత్ క్వార్టర్ ఫైనల్లో 4-1తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)పై విజయం సాధించాడు. 63 కేజీల క్వార్టర్ ఫైనల్లో మనీశ్ 5-0 తో వాండెర్సన్ డి ఒలివిరా (బ్రెజిల్)పై గెలుపొందాడు. గతంలో ఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ భారత్ ఒక కాంస్యాన్ని మించి గెలవలేకపోయింది. విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధురి (2017) కాంస్యం నెగ్గారు.
ఈఎస్ఐ మందుల స్కామ్‌లో అధికారపార్టీ నేతలు: లక్ష్మణ్