telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో అది దౌర్భాగ్యం…

ponnala lakhmaih

టీఆర్ఎస్ కు మాత్రమే మ్యానిఫెస్టోలు, ప్రొగ్రెస్ రిపోర్టులు వెబ్సైట్ లో పెట్టి తీసేయడం సాధ్యం అని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మేడిపండు కంటే దారుణంగా టీఆర్ఎస్ ప్రొగ్రెస్ రిపోర్టు ఉంది అని తెలిపారు. ఎవరు సొమ్ము 17500 కోట్లు మెట్రోరైలుకు ఖర్చు చేశారు? కాంగ్రెస్ మెట్రో ప్రారంభించింది. దేశంలోనే మంచి పనిగా గుర్తింపు పొంది.. అవార్డు కూడా తీసుకున్నాం అని అన్నారు. కేసీఆర్ మెట్రో ఆపేసి నీచ, నికృష్ట పని చేశాడు.  నీవల్ల ప్రజలకు అసౌకర్యం కలిగింది. ముక్కు నేలకు రాస్తావా? తప్పు ఒప్పుకుంటావా? అన్నారు. టీఆర్ఎస్ విడుదల చేసింది అభివృద్ధి ప్రణాళిక కానే కాదు. అవినీతి నివేదిక. దీనిపై విచారణ జరగాలి. నిజనిజాలు బయటకు రావాలి. రాష్ట్రంలో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. యాదాద్రి, భద్రాద్రి ఎక్కడ ఉంది? అన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులే. విద్యుత్ కొనుగోలు చేయడం కూడా ప్రగతేనా? ఐటికి 2100 కోట్లు ఖర్చు చేశామంటున్న టీఆర్ఎస్.. యానిమేషన్ గేమింగ్ 400 కోట్లతో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఏడు సంవత్సరాల నుంచి దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు. చర్చకు రమ్మంటే ముఖం చాటేసిన టీఆర్ఎస్ నాయకులు… ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని తెలిపారు.ఇక గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ నాయకులు జాతరలు, సంతలకు వచ్చినట్లు వస్తున్నారు. ఒక్క నవోదయ స్కూల్ తెలంగాణకు కేటాయించని స్మృతి ఇరానీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పుకుని కేంద్ర మంత్రులు జీహెచ్ఎంసిలో ఓట్లు అడిగితే బాగుండేది. ఉత్తరప్రదేశ్ లో చేసినట్లు అశాంతి పాలన చేసిన ఆయన… తెలంగాణలో కూడా అలానే ఉండాలని యోగిఆదిత్య ఇక్కడకు వస్తున్నారా? కాంగ్రెస్ ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలు చేయదు. వాటిని సమర్దించదు. విద్యుత్ చార్జీలు చెల్లించడంలో రైతులు ఆలస్యం చేశారని ట్రాన్స్ ఫార్మర్ కు తాళం వేసిన పరిస్థితులు తెలంగాణలో నెలకొనడం దౌర్భాగ్యం అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

Related posts