telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సిటీ బస్సుల్లో స్టాండింగ్ జర్నీకి చెక్!

rtc protest started with arrest

కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితులు కొలిక్కి వచ్చి రవాణాను తిరిగి ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. శానిటైజ్ చేసిన తర్వాత బస్సులను రోడ్లపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇకపై స్టాండింగ్ జర్నీకి చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. సిటీ బస్సులకు రెండువైపులా డోర్లు ఏర్పాటు చేయాలని, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం కోసం ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరిని మాత్రమే అనుమతించే అవకాశముంది.

లాక్‌డౌన్‌ కారణంగా మెట్రో రైలు రూ.100 కోట్లు, ఆర్టీసీ రూ.120 కోట్ల మేర నష్టపోయాయి. మెట్రో రైలులో మూడు బోగీల్లో కలిపి 900 మంది ప్రయాణించే వీలుండగా, ఇకపై అతి కొద్ది మందితోనే అంటే దాదాపు సగం మందితోనే రైళ్లను నడపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణికులు నిల్చునేందుకు తెలుపు రంగుతో సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నారు.

Related posts