telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

గుడ్ న్యూస్ : కరోనాను ఎదుర్కొనేందుకు రానున్న ఇమ్మునిటి బూస్టర్

కరోనా వ్యాక్సిన్ రావడం ఆలస్యం అవుతున్న తరుణంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పరిశోధనలు ఎన్నో జరుగుతున్నాయని క్లోన్ డీల్స్ సి.ఈ.ఓ అతీక్ పటేల్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సహజసిద్ధమైన ప్రకృతి వనరుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే “ఇమ్మునిటీ బూస్టర్” ను హైదరాబాద్ కు చెందిన “క్లోన్ డీల్స్” ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిందన్నారు. కరోనా ముక్త్ భారత్ అన్న నినాదంతో దీర్ఘకాలంపాటు పరిశోధన చేసి, ఈ ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేయబోతున్నామని తెలిపారు. “కార్డిసెప్స్ మిలిటారీస్” అనే అరుదైన “మష్రూమ్” ద్వారా ఈ ప్రొడక్ట్ ను ( ఔషధం) రూపొందించామన్నారు. త్వరలో మెడిసిన్ రూపంలో కూడా రాబోతున్న ఈ ప్రొడక్ట్ ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా “ఫుడ్ ప్రొడక్ట్” గా కూడా “క్లోన్ డీల్స్” సంస్థ అందుబాటులోకి తెస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై సీసీఎంబి వంటి ప్రఖ్యాత సంస్థలు “ట్రయల్స్” పూర్తి చేశారని వెల్లడించారు. ఎయిమ్స్ కూడా హ్యూమన్ ట్రైల్స్ ప్రారంభించిందన్నారు. అత్యంత సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తి ద్వారా “కోవిడ్-19” లాంటి మహామ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్లుగా పలు సంస్థలు ఈ ఉత్పత్తిని ధ్రువీకరించాయని తెలిపారు. ఓరల్ సస్పెన్షన్ రూపంలో తీసుకునే ఈ ప్రొడక్ట్ “కరోనా” పై పోరాడటంలో విజయవంతమైన ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి “ఫుడ్ ప్రోడక్ట్” కేటగిరిలో అందుబాటులోకి వస్తున్న ఉత్పత్తి ని, ఈనెల 22వ తేదీన సిసిఎంబి అధికారికంగా ప్రకటించనుందన్నారు. FSSAI అనుమతి పొందిన ఈ ప్రోడక్ట్ ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ పార్టనర్ గా “NUZEN HERBALS PVT LTD” వ్యవహరించనుందని పేర్కొన్నారు.

Related posts