telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. పనులలో ఆటంకాలు.. ఉద్యోగంలో ఒత్తిడి..

today rasi falalu

మేషం : ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల నుంచి సహాయం అందుతుంది.ఆస్తి వివాదాలు తీరి లాభపడతారు. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగులకు పైస్థాయి నుంచి అభినందనలు.

వృషభం : మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

మిథునం : నూతన ఉద్యోగావకాశాలు.. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

కర్కాటకం : ఆర్థిక విషయాలు కొంత గందరగోళం. బంధువర్గంతో చర్చలు. శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాల్లో ఒత్తిడులు.

సింహం : అంచనాలు నిజమవుతాయి. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కన్య : భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. చర్చలు ఫలిస్తాయి. సంఘంలోగౌరవమర్యాదలు పొందుతారు. పనుల్లో విజయం. ఆకస్మిక ధనలబ్ధి.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి.

తుల : వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విరోధాలు. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాVతతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారులకు చికాకులు.

వృశ్చికం : చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. రుణదాతల ఒత్తిడులు. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు : నూతన ఉద్యోగయోగం. కొన్ని పనులలో విజయం. ధార్మికకార్యక్రమాలపై ఆసక్తి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు.

మకరం : కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆప్తుల నుంచి సలహాలు అందుకుంటారు. యత్నకార్యసిద్ది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం : రుణయత్నాలు సాగిస్తారు. ఆప్తులతో వివాదాలు. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

మీనం : చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

Related posts