మేషం: రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభం: కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని సమకూర్చుకుంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
మిథునం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. నోరు అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. ఏదైనా అమ్మకానికై చేసే ప్రయత్నం వాయిదా వేయడం మంచిది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం: భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అన్నివిధాలా కలిసివస్తుంది.
సింహం : అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతతో పనిచేయాల్సి వుంటుంది. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఖర్చులు అదుపు చేయాలనే ప్రయత్నం ఫలించకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
కన్య: పండ్ల, కొబ్బరి, పూల, కూరగాయ, వ్యాపారులకు, స్టాకిస్టులకు లాభదాయకం. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. క్రయ విక్రయాలు సామాన్యంగా వుంటాయి.
తుల: ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు.
వృశ్చికం: ప్రైవేట్ సంస్థల్లోని వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు ఓర్పు, సంయమనం పాటించండి. కొత్త షేర్ల కొనుగోలులో పునరాలోచన మంచిది. ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం ఉద్యోగ, వివాహ యత్నాలు కలిసివస్తాయి. విదేశీ యత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు.
ధనస్సు: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్స్, కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ప్రయాణాలు, స్త్రీల ఆరోగ్యంలో మార్పు ఊరటనిస్తుంది.
మకరం: బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు కొన్ని నిర్భంధాలకు లోనవుతారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులకు వ్యాపకాలు అధికమవుతాయి.
కుంభం: చేపట్టిన పనులు వాయిదా వేయడం అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుచారు. కాంట్రాక్టర్లకు అసాధ్యమనుకున్న టెండర్లు చేజిక్కించుకుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసివస్తుంది.
మీనం: చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులు, వ్యవసాయ కూలీలకు ఆటుపోట్లు తప్పవు. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి : మంత్రి ప్రత్తిపాటి