telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్..

ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఇందులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బౌలింగ్ చేయనుంది. ఇక ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై జోరు మీద ఉంది. ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించిన చెన్నై ఇందులోని గెలిచి పోఇంతలా పట్టికలో మొదటి స్థానానికి వెళాళ్లని చూస్తుంది. కానీ హైదరాబాద్ మాత్రం ప్రతి మ్యాచ్ లోను గెలుపు దగ్గర వరకు వచ్చి ఓడిపోతుంది. మరి ఈ ఐపీఎల్ లో నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి చెన్నై జోరుకు బ్రేక్ వేస్తుందా… లేదా అనేది చూడాలి.

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, జగదీషా సుచిత్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్

Related posts