telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి: కేటీఆర్‌

KTR TRS Telangana

ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోన వైరస్ నివారణ కోసం అన్ని దేశాల కంటే ముందు వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు ఆరు భారతీయ కంపెనీలు పోటీపడుతున్నట్టు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ సోమవారం వెల్లడించారు. ఇందులో (జైడస్‌ క్యాడిలా, భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌, బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మిన్వాక్స్‌)తో పాటు హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలు ఉన్నట్టు ఆయన తెలిపారు.

ప్రపంచంలో వ్యాక్సిన్ల తయారీకి భారత్‌ కేంద్ర బిందువుగా ఉన్నదని ఆయన ట్వీట్‌చేశారు. నీతి ఆయోగ్‌ ఈ ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు పోటీపడుతున్న ఆరు భారతీయ కంపెనీల్లో మూడు కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవే కావడం గర్వకారణమన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts