telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బెజవాడలో వ్యాక్సిన్ అమ్ముతున్న ప్రభుత్వ డాక్టర్…

corona vaccine covid-19

మన దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఎక్కువ కేసులు నమిదవుతున్న రాష్ట్రంలో ఏపీ కూడా ఉంటుంది. ఇక్కడ రోజుకు 20 వేలకు పాగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఈ రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఉంది. దాంతో ఓ ప్రభుత్వ డాక్టర్ వ్యాక్సిన్ అమ్ముతు సొమ్ము చేసుకోవాలని చూసాడు. అయితే దీనిని గుర్తించిన పోలీసులు.. అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో వేయాల్సిన వ్యాక్సిన్‌ను ఏకంగా అమ్మ‌కానికి పెట్టి మ‌రీ.. వ్యాక్సిన్ వేస్తున్న‌ట్టు గుర్తించారు పోలీసులు.. వ్యాక్సిన్ కారులోనే వేస్తున్నట్టు సమాచారం అందటంతో జీ.కొండూరు ప్రభుత్వ డాక్టర్ ఎంఎస్ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అత‌ని ద‌గ్గ‌ర 5 కోవాగ్జిన్, 6 కోవిషీల్డ్ వ్యాక్సిన్ సీసాలు, సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు.. ప్రస్తుతం కోవిడ్ హెల్ప్ లైన్ లో డిప్యుటేషన్ పై విధుల్లో డాక్టర్ రాజు ఉన్న‌ట్టుగా చెబుతున్నారు.

Related posts