telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణాలో మళ్ళీ ఒక్కటైనా జ‌న‌సేన‌-బీజేపీ…

ఏపీలో జ‌న‌సేన‌-బీజేపీ మ‌ధ్య ఉన్న పొత్తు గురించి అందరికి తెలుసు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆ పార్టీల మధ్య భిన్నమైన ప‌రిస్థితి ఉంటుంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీకి స‌పోర్ట్ చేసిన జ‌న‌సేన‌.. ఎమ్మెల్యే ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి మాత్రం.. టీఆర్ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.. ఇక నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో త‌ట‌స్థంగా ఉంది.. అయితే, ఇప్పుడు మ‌ళ్లీ ఖ‌మ్మం వేదిక‌గా.. ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు చిగురించింది.. ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో 12 డివిజ‌న్ల‌లో బీజేపీ, 10 డివిజ‌న్ల‌లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించ‌నున్నారు. అయితే, ఎక్క‌డెక్క‌డి నుంచి ఏ పార్టీ అభ్య‌ర్థి బ‌రిలోకి దిగాలి అనే విష‌యంపై ఇరు పార్టీలు త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని చెబుతున్నారు. కాగా, తెలంగాణ‌లో బీజేపీ నేత‌ల వ్య‌వ‌హార శైలిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యం చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. చూడాలి మరి ఈ ఎన్నికలలో ఈ రెండు పార్టీలు ఏం చేస్తాయి అనేది.

Related posts