telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మాకు ఓ అద్భుతమైన ఆటగాడు దొరికాడు : వార్నర్

నిన్నటితో ఐపీఎల్ 2020 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ఫైన్సల్స్ కు వెళ్లాలంటే తప్పకుండ గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో 17 పరుగుల తేడాతో ఓడిపోయింది హైదరాబాద్. ఈ మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ… ఈ టోర్నీ ప్రారంభంలో మమల్ని ఎవరు పట్టించుకోలేదు. అందరూ టాప్ లో ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగుళూరు గురించే మాట్లాడుకున్నారు. ఒకదశలో మేము ప్లే ఆఫ్స్ కి వస్తామని కూడా అనుకోలేదు. ప్రస్తుతం సన్ రైజర్స్ ఉన్న స్థానంతో మేము సంతోషంగా ఉన్నాము. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో టి నటరాజన్ మా జట్టుకు దొరికి అద్భుతమైన ఆటగాడు అని వార్నర్ పేర్కొన్నాడు. భువనేశ్వర్ తప్పుకోవడంతో తుది జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు మొత్తం 16 మ్యాచ్ లలో 16 వికెట్లు సాధించాడు. నటరాజన్ అలాగే రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేసారు. కానీ మా కీలక ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్ మరియు వృద్దిమాన్ సాహ జట్టులో లేకపోవడంతో జట్టు కొంచెం బలహీనపడింది అని వార్నర్ అంగీకరించాడు. అలాగే మీరు క్యాచ్‌లు తీసుకోకపోతే మీరు గెలవలేరు, తద్వారా, మేము తదుపరిసారి మరింత మెరుగ్గా చేయాల్సి ఉంటుంది. అదే ఈ టోర్నమెంట్‌లో మమ్మల్ని నిరాశపరుస్తుంది అన్నాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ అయిన ఇండియాలో జరుగుతుందని అనుకుంటున్నాను అంటూ వార్నర్ ఆశాభావం వ్యక్తం చేసాడు.

Related posts