telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

రెడ్ మీ 9 స్పెసిఫికేషన్లు లీక్…?

Red-me

రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ సర్టిఫికేషన్ పొందింది. యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ తాజాగా M2004J19G మోడల్ నంబర్ ఉన్న ఫోన్ ను సర్టిఫై చేసింది. ఇదే రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ అని బలంగా వినిపిస్తోంది. ఆన్ లైన్ లో లీకైన ఈ లిస్టింగ్ లో దీని స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. వాటి ప్రకారం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఆన్ లైన్ లో కనిపించిన డాక్యుమెంట్ల ప్రకారం ఈ మోడల్ నంబర్ ఉన్న ఫోన్ ను ఎఫ్ సీసీ పైట్ మే 1వ తేదీనే సర్టిఫై చేసింది. కాబట్టి ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లిస్ట్ లో చూపించిన స్పెసిఫికేషన్ల ప్రకారం ఇందులో 6.8 అంగుళాల స్క్రీన్ ను అందించనున్నారు. రెడ్ మీ 8 స్మార్ట్ ఫోన్ లో అందించిన స్క్రీన్ కంటే (6.22 అంగుళాలు) చాలా పెద్దది. ఈ ఫోన్ ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4920 ఎంఏహెచ్ గా ఉంది. దీనికి తోడు ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయని, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. లీకైన ఇమేజ్ ప్రకారం చూస్తే దీని డిజైన్ రెడ్ మీ కే30 స్మార్ట్ ఫోన్ తరహాలో ఉంది. అయితే దీని లాంచ్ గురించి షియోమీ ఇంతవరకు ప్రకటించలేదు. ఈ మోడల్ నంబర్ చైనా 3సీ, రష్యా ఈఈసీ వెబ్ సైట్లలో కూడా కనిపించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రెడ్ మీ 9 దీని లాంచ్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.

Related posts