telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగ్గయ్యపేటకు ఏపీ సీఎం వరాలు..

cm Jagan tirumala

ఇవాళ భూ హక్కు-భూ రక్ష ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సీఎం జగన్… జగ్గయ్యపేట బహిరంగ సభ పాల్గొన్నారు. జ్యోతి ప్రజల్వన చేసి ఈ సభను ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. భూముల రీ-సర్వే చేపట్టేందుకు ఏ రాష్ట్రమూ సాహసించ లేదని పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరగాలనే రీ-సర్వే కార్యక్రమం అమలుకు నిర్ణయించామని….16 వేల మంది సిబ్బందిని నియమించి.. సర్వేలో శిక్షణ ఇప్పించి రీ-సర్వేకు శ్రీకారం చుట్టామన్నారు. అయితే.. ఈ సందర్భంగా జగ్గయ్యపేటపై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. జగ్గయ్యపేటను పారిశ్రామిక హబ్ గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈఎస్ఐ కేంద్రానికి రూ. 5 కోట్లు, జగ్గయ్యపేటలో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రూ.15 కోట్లు, ట్రామా కేర్ సెంటరుకు రూ. 3 కోట్లు, ఎర్ర కాల్వ, రేపల్లె వాగు అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు ఏర్పాటు విషయంలో కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. అనంతరం జగ్గయ్యపేట నుంచి హెలీకాప్టర్‌లో అమరావతికి బయలు దేరారు సీఎం జగన్.

Related posts