telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెరచుకోనున్న కల్లు దుకాణాలు!

srinivas goud minister

తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఇక గీత కార్మికుల కోసం కల్లు దుకాణాలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గ్రీన్ సిగ్నలిచ్చారు. కట్టడి ప్రాంతాల్లో మినహా అన్ని జిల్లాల్లో కల్లు గీత కార్మికులు కల్లును భౌతికదూరాన్ని పాటిస్తూ అమ్ముకునేందుకు అనుమతిచ్చారు.

వైన్‌షాపుల మాదిరిగా కల్లు దుకాణాలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం నాయకులు మంత్రిని కోరుతూ ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు గీత కార్మికులు కల్లును విక్రయించేందుకు అనుమతిచ్చారు.

Related posts