telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మా ఇంటిని కూల్చేస్తున్నారు… హిమజ ఎమోషనల్ పోస్ట్

Himaja

100 రోజులకు పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్-3 టైటిల్ ను సింగర్ రాహుల్ సింప్లిగంజ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. తాజాగా బిగ్ బాస్ 3 హౌజ్ ఇప్పుడు కూల్చేసారు స్టార్ మా యాజమాన్యం. దాంతో ఎమోషనల్ అవుతున్నారు ఇంటి సభ్యులు. ముఖ్యంగా కంటెస్టెంట్ హిమజ అయితే కాస్త ఎక్కువగానే ఎమోషనల్ అయిపోయింది. ఈ ఇంటిని పడగొడుతున్నారు కానీ అక్కడున్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ అలాగే పదిలంగా ఉంటాయంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి అభిమానులు కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఈ సారి బిగ్ బాస్ 3లో మోస్ట్ రెబలిస్టిక్ కంటెస్టెంట్ అంటూ పేరు తెచ్చుకుంది హిమజ. ఈమె చివరి వరకు ఉంటుందేమో అనుకున్నారు కానీ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అప్పట్లో హిమజ ఎలిమినేషన్‌పై కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. ఏదేమైనా కూడా బిగ్ బాస్ 3 ఇంటిని కూల్చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

Related posts