ఏపీ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. అయితే ఈ సమయంలో అనంతపురంలో వైసీపీ కీలక సమావేశం జరిగింది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల జిల్లా నేతలతో సమావేశమై పలు సూచనలు చేయడమే కాకుండా విబేధాలపై వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విబేధాలు పక్కన బెట్టి అన్ని చోట్ల సింగిల్ నామినేషన్ ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. రాష్ట్రంలో అతి తక్కువ ఏకగ్రీవాలు ఉన్న నేపథ్యంలో జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెబుతున్నారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జెల రామక్రిష్ణారెడ్డి ఈ మేరకు కీలక సమావేశం నిర్వహించారు. సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్లో ఇవాళ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీల ఇతర ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. తొలి విడతలో ఎందుకు అతి తక్కవ నామినేషన్లు వచ్చాయని.. అలాగే చాలా చోట్ల ఇద్దరు ముగ్గరు పార్టీ నేతలు ఎందుకు బరిలో ఉన్నారని నేతలను ప్రశ్నించారు. ఇక రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉండకూదని ఆదేశించారు. సింగిల్ నామినేషన్ ఉండాలి.. అక్కడ భారీ మెజార్టీతో గెలవాలని.. ఈ బాధ్యత అంతా ఎమ్మెల్యేలదని వారు తేల్చి చెప్పారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post