telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రంగంలోకి కేంద్ర ఎన్నికల సంఘం..దుబ్బాకకు ప్రత్యేక అధికారి నియామకం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబరు 9న వెలువడింది. నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. ఈ ఉప ఎన్నిక నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. ఒకవైపు హరీష్ రావు టీఆర్ఎస్ తరపున దూసుకుపోతున్నాడు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ లు గట్టి పోటీని ఇస్తున్నాయి. గత రెండు రోజులుగా దుబ్బాక రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. రఘునందన్ రావు ఇంట్లో సోదాలు, బండి సంజయ్ అరెస్ట్ తో బీజేపీకి మంచి సింపతీ వచ్చింది. అంతేకాదు నిన్న ఎన్నికల ప్రత్యేక అధికారిని నియమించాలని ఎన్నికల కమిషన్ ని కోరింది బీజేపీ. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎన్నికకు ప్రత్యేక పరిశీలకున్ని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. లా అండ్ ఆర్డర్ పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ సరోజ్ కుమార్ ను నియమించింది. కాగా..ఇటీవల దుబ్బాకలో నోట్ల కట్టలకు సంబంధించిన వివాదం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts