telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపిలో మరో విగ్రహం ధ్వంసం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

ఆంధ్ర ప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు జరిగిన ఘటన పై అధికారులు చర్యలు చేపడుతున్నారు. .అయిన రాష్ట్రంలో ఆందోళనకరంగా దాడులు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా మరో ఘటన కలకలం సృష్టిస్తుంది..కర్నూల్ జిల్లాలోని ఓ ప్రముఖ దేవాలయంలో విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ చర్చలకు దారి తీసింది..

 

వివరాల్లోకి వెళితే.. మంత్రాలయం మండలం వగరూరు చెరువు కట్ట నరసప్పతాత విగ్రహంపై ఉండే శేషపడగలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్వామివారి విగ్రహం పై ఉండే తొమ్మిది శేష పడగల్లో రెండు పడగలను విరగొట్టారు.. ఈ రోజు ఉదయం పూజలను నిర్వహించడానికి వెళ్ళిన పూజారి ఈ విగ్రహం ధ్వంసం జరిగిన విషయాన్ని ఊరి పెద్దలకు చెప్పాడు. ఈ ఘటన పై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.కర్నూల్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో జరగడంతో ప్రజలు మండిపడుతున్నారు..

Related posts