భారత క్రికెటర్లపై పాకిస్తాన్ ఆటగాళ్లు చౌకబారు వ్యాఖ్యలు చేయడం షరా మామూలే. మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు అతిశయోక్తులను తలపించేలా ఉన్నాయి. క్రికెట్ వ్యాఖ్యాత సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బౌలింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటూ భారత క్రికెటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బౌలింగ్ కే వచ్చానంటే టీమిండియా చివరి వరుస బ్యాట్స్ మెన్ హడలిపోయేవారని తెలిపాడు.
కావాలంటే అవుట్ చేసుకో… కానీ మా శరీరాలకు తగిలేలా బంతులు విసరొద్దని టీమిండియా క్రికెటర్లు చెప్పేవాళ్లు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి” అని అక్తర్ వివరించాడు. కౌంటీల్లో ఓసారి ఓ ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ తనతో అడిగి మరీ బౌలింగ్ చేయించుకుని దవడ పగలగొట్టుకున్నాడని అక్తర్ చెప్పుకొచ్చాడు.
‘కియా తరలింపు’ వార్తలపై స్పందించిన లోకేశ్