telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

రియల్‌మి నుండి .. 4జి బంద్ .. ఇక అంతా 5జి నే ..

no real me 4g from 2020 only 5g

చైనాలో రియల్‌మి సంస్థ వచ్చే ఏడాది నుండి కేవలం 5G మొబైల్ ఫోన్‌లను మాత్రమే విడుదల చేయనున్నట్లు సంస్థ CEO మరియు వ్యవస్థాపకుడు స్కై లి తెలిపారు. రియల్‌మి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 4G ఫోన్‌లను అమ్మడం కొనసాగిస్తుంది. గత నెలలో రియల్‌మి ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ రెండవ వారంలో రియల్‌మి XT 730G ని కూడా ఇండియాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రియల్‌మి యొక్క 5G ఫోన్లు 2020 మొదటి త్రైమాసికంలో ఇండియాలో విడుదల చేయనున్నట్లు కూడా కంపెని ధృవీకరించింది.

రియల్‌మి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మాత్రమే దృష్టి సారించనున్నట్లు సమాచారం. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు 5G ని వచ్చే ఏడాది మిడ్-రేంజ్ మరియు బడ్జెట్ ఫోన్‌లకు తీసుకురావడానికి చూస్తున్నారు. 5G ను మరింత ప్రాచుర్యం చేయడానికి మరియు వినియోగదారులకు సులభంగా అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రియల్‌మి తన X50, X50 యూత్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో 5G కనెక్టివిటీతో విడుదల చేయబోతున్నట్లు ఒక నివేదిక తెలిపింది. షియోమి యొక్క ఉప-బ్రాండ్ రెడ్‌మి డిసెంబర్ 10 న చైనాలో జరిగే కార్యక్రమంలో తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. ఈ సంస్థ రెడ్‌మి K30 ఫోన్‌ను విడుదల చేయనున్నది. ఇది SA మరియు NSA నెట్‌వర్క్ రకాల మద్దతుతో 5G కనెక్టివిటీని కలిగి ఉంటుంది. అంటే మార్కెట్‌లోకి 5G డ్యూయల్ మోడ్ కనెక్టివిటీతో లాంచ్ చేయబోతున్న షియోమి యొక్క 5G స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి K30.

Related posts