మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు, వర్షం వంటి క్లాసిక్ చిత్రాలని తెరకెక్కించిన ఎంఎస్ రాజు ఇప్పుడు రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజు రాయడం విశేషం. గూడూరి శివరామకృష్ణ, గూడురు సతీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేషన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. “డర్టీ హరి” అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేశారు. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో హరి పాత్ర పోషిస్తున్న హీరో శ్రవణ్ రెడ్డి బాత్‌టబ్‌లో సిగరెట్ తాగుతున్నట్టుగా ఉంది. ఈ చిత్రం అందంగా మరియు కవితాత్మకంగా యువ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని ఎంఎస్ రాజు వెల్లడించారు.